నిర్మల్లో లలిత పరమేశ్వరి అమ్మవారికి చీరలు అందజేత

నిర్మల్, వెలుగు: నిర్మల్ ​పట్టణంలోని మల్లన్న గుట్ట హరిహర క్షేత్రంలోని లలిత పరమేశ్వరి అమ్మవారికి నవరాత్రులు ముగిసే వరకు ప్రతిరోజు ఒక చీర చొప్పున 9 చీరలను ప్రముఖ వ్యాపారి గందె సుధీర్, జయశ్రీ దంపతులు అందజేశారు.

శనివారం ఆలయ ధర్మకర్తలు అల్లోళ వినోదమ్మ, మురళీధర్ రెడ్డి, గురుస్వామి నవయుగమూర్తి, కోశాధికారి వేణుగోపాల రెడ్డి ఆధ్వర్యంలో వీరు చీరలను అందజేశారు. నవరాత్రుల కోసం ఆలయాన్ని, హరిహర క్షేత్రాన్ని అందంగా ముస్తాబుచేశారు.