ఫిబ్రవరి 14 నుంచి గాంధారి ఖిల్లా జాతర

ఫిబ్రవరి 14 నుంచి గాంధారి ఖిల్లా జాతర

కోల్​బెల్ట్, వెలుగు : మందమర్రి మండలం బొక్కలగుట్ట గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరను ఫిబ్రవరి 14,15,16 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆదివాసీ నాయక్​పోడ్​సేవా సంఘం జిల్లా ప్రెసిడెంట్ పెద్ది భార్గవ్​తెలిపారు. సోమవారం బొక్కలగుట్ట గ్రామ శివారులోని సదర్ల భీమన్న ఆలయాన్ని గాంధారి ఖిల్లా ఆలయ కమిటీ, ఆదివాసీ నాయకపోడ్ సేవా సంఘం, హక్కుల పరిరక్షణ కమిటీ, తుడుందెబ్బ

ఆదివాసి నాయక పోడు సాంస్కృతిక కళ అభివృద్ధి స్వచ్ఛంద సంస్థ లీడర్లు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జాతర నిర్వహణపై చర్చించారు. ఫిబ్రవరిలో మాఘశుద్ధ పౌర్ణమి(దేవుళ్ల పున్నమి) నుంచి మూడ్రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తామన్నారు.