
పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆసుపత్రిలోని బ్లడ్సెంటర్కు తెలంగాణ బెస్ట్బ్లడ్ బ్యాంక్ అవార్డు వచ్చింది. తెలంగాణ ఎయిడ్స్కంట్రోల్సొసైటీ ఈ అవార్డును అందజేసింది.
గతేడాది గాంధీ బ్లడ్సెంటర్ 52 రక్తదాన శిబిరాలు నిర్వహించి, 14 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకు గాను ఈ అవార్డు లభించిందని సూపరింటెండెంట్ప్రొఫెసర్రాజకుమారి తెలిపారు. మంగళవారం బ్లడ్ సెంటర్ ఇన్చార్జ్ డాక్టర్ సరిత, సిబ్బందిని ఆమె అభినందించారు. ఆర్ఎంఓ–1 డాక్టర్శేషాద్రి పాల్గొన్నారు.