ప్రెస్​ అకాడమీ చైర్మన్​ను సన్మానించిన గాంధీ గ్లోబల్

నల్గొండ అర్బన్, వెలుగు : గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్ట ఆధ్వర్యంలో ప్రెస్ అకాడమీ చైర్మన్  శ్రీనివాస్ రెడ్డిని గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చేనేత శాలువాలతో శ్రీనివాస్​రెడ్డిని సత్కరించి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి, ప్రముఖ సంఖ్యా శాస్త్రవేత ఎనుగుల వెంకటరెడ్డి, సుభాష్ చంద్ర, చైతన్య, శేఖర్, శంకర్ రెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.