ఆరోగ్యశ్రీతో మూడేండ్ల చిన్నారికి ఫ్రీగా ఆపరేషన్
డాక్టర్లను అభినందించిన మంత్రి హరీశ్ రావు
పద్మారావునగర్, వెలుగు: గాంధీ హాస్పిటల్ లో మరో అరుదైన ఆపరేషన్‌ను డాక్టర్లు విజయవంతంగా నిర్వహించారు. సోమవారం హాస్పిటల్ ఆవరణలో సూపరింటెండెంట్ రాజారావు మాట్లాడుతూ..సిద్దిపేట జిల్లా వర్గల్మండలం శేరిపల్లి గ్రామానికి చెందిన నవీన్ కూతురు మూడేండ్ల రుత్వికకు వినికిడి సమస్య ఉండగా గాంధీ హాస్పిటల్ లో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీని విజయవంతంగా నిర్వహించామన్నారు.
ఈఎన్‌టీ డిపార్ట్‌మెంట్ కు చెందిన డాక్టర్ల టీమ్ మొదటిసారిగా ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ట్రస్ట్స్కీమ్ తోఈ సర్జరీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈఎన్టీ డాక్టర్ల టీమ్ ఫ్రొఫెసర్ఎ. శోభన్‌బాబు, అసిస్టెంట్ప్రొఫెసర్లు రతన్కుమారి, విజయ్‌కుమార్, అనస్తీషియా ప్రొఫెసర్ మురళీధర్, అసిస్టెంట్ ఫ్రొపెసర్ గౌతమి, ఆడియోలాజిస్ట్సాయికిరణ్ సర్జరీ చేసిన వారిలో ఉన్నారన్నారు. విజయవంతంగా సర్జరీ చేసిన డాక్టర్ల టీమ్ ను మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ లో అభినందించారు.