పద్మారావునగర్, వెలుగు : గాంధీ ఆస్పత్రిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందు జాగ్రత్తగా ఎంపాక్స్(మంకీ పాక్స్) బాధితులకు ప్రత్యేకంగా రెండు ఐసోలేషన్వార్డులను శుక్రవారం అందుబాటులోకి వచ్చాయి. పురుషులు, మహిళా పేషెంట్లకు వేర్వేరుగా
14 బెడ్లతో కూడిన రెండు ఐసోలేషన్వార్డులు సిద్ధం చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్రాజకుమారి తెలిపారు. ఇంతవరకు ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదని, లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్లను కలిసి ట్రీట్ మెంట్ పొందాలని ఆమె సూచించారు.