
పద్మారావునగర్, వెలుగు: ఉద్యోగులు నిబద్ధతతో వ్యవహరించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి అన్నారు. అంకితభావంతో చేసే పనులు తమకు గుర్తింపునిస్తాయన్నారు. టీఎన్జీవో మెడికల్, హెల్త్ సెంట్రల్ ఫోరం ఆధ్వర్యంలో రూపొందించిన 2025 ప్రత్యేక డైరీ, క్యాలెండర్ లను అద్యక్ష, కార్యదర్శులు ఈ.కిరణ్ రెడ్డి, ఎం.సత్యనారాయణ రెడ్డి శుక్రవారం ఆమెకు అందచేశారు.
టీఎన్జీవో మెడికల్,హెల్త్ సెంట్రల్ ఫోరం ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ ను శాలువాతో సత్కరించారు. ప్రజలకు వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది బాధ్యతాయుతంగా మరింత మెరుగ్గా వైద్య సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నామని టీఎన్జీవో యూనియన్ నాయకులు పేర్కొన్నారు.
అసిస్టెంట్ డైరెక్టర్ ప్లోరెన్స్ మెర్లిన్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్, గాంధీ టీఎన్జీవో యూనిట్ అద్యక్ష,కార్యదర్శులు ప్రభాకర్, ప్రసన్నానంద్, యూనియన్ నాయకులు జనార్థన్, శ్రవణ్ కుమార్, సరళ, సత్యనారాయణ, కలీమ్, విజయలక్ష్మీ, భావన, శ్రీనివాస్ పాల్గొన్నారు.