సోమాలియా నుంచి వచ్చిన వ్యక్తికి గాంధీలో చికిత్స

సికింద్రబాద్ గాంధీ ఆస్పత్రిలో ఒమిక్రాన్ అనుమానితుడు ఉన్నాడని వస్తున్న వార్తలపై గాంధీ ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్. రాజారావు స్పందించారు. సోమాలియా నుంచి వచ్చిన వ్యక్తి  గాంధీలో చికిత్స పొందుతున్నాడని ఆయన తెలిపారు. ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలిందన్నారు. అయితే అతనికి ఒమిక్రాన్ సోకిందా ? లేదా అన్న విషయం ఇంకా తెలియలేదన్నారు. ప్రస్తుతం అతనికి ఒమిక్రాన్ లేదన్నారు. అతడి శాంపిల్స్ సేకరించి నిన్న జీనోమ్ సీక్వెన్సింగ్ కి పంపడం జరిగిందని తెలిపారు. 

ఐదు రోజుల క్రితం  అతడు ఇండియాకు వచ్చాడని తెలిపారు. గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చిన తరవాత అతని ఆరోగ్యం మెరుగుపడిందన్నారు.  అతనికి ఓమిక్రాన్ ఉందా లేదా అని ఇంకా నిర్దారణ కాలేదన్నారు. ఎయిర్ పోర్ట్ లో నెగటివ్ వచ్చిందన్నారు. అయితే ప్రయివేట్ హాస్పిటల్ లో చేసిన కరోనా టెస్ట్ లలో అతడికి పాజిటివ్ అని తేలిందన్నారు. ఆ వ్యక్తిని ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి తీసుకొని రావడం జరిగిందన్నారు. అతినికి ఇతర వ్యాధులు కూడా ఉన్నాయన్నారు. ఓమిక్రాన్ కి కొత్త ట్రీట్మెంట్ లేదన్నారు. కేవలం లక్షణాలు బట్టి చికిత్స అందిస్తామన్నారు. మరోవైపు జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడానికి గాంధీలో ఏర్పాట్లు జరుగుతున్నాయని డాక్టర్ రాజారావు తెలిపారు.

 

ఇవి కూడా చదవండి:

గాంధీలో ఒమిక్రాన్ అనుమానితుడు

UK Omicron cases: ఒకేసారి పదివేల ఒమిక్రాన్ కేసులు