
హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం వెలుగు చూసింది. గాంధీ మెడికల్ కళాశాలలో కొత్తగా ప్రవేశం పొందిన జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది. ర్యాగింగ్ విషయం గురించి తెలుసుకున్న డీఎమ్ఈ రమేష్ రెడ్డి....సీనియర్లపై కఠిన చర్యలు తీసుకున్నారు. ర్యాగింగ్ కు పాల్పడిన పది మంది సీనియర్లను కాలేజీ హాస్టల్ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేశారు.
గాంధీ మెడికల్ కాలేజీలో సీనియర్లు ..జూనియర్లను వేధింపులకు గురిచేసినట్లు డీఎంఈ రమేష్ రెడ్డి ధృవీకరించారు. ఈ ఘటనలో జూనియర్లపై ర్యాగింగ్‌కు పాల్పడిన పదిమంది సీనియర్లను కాలేజీ హాస్టల్ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్ చేసినట్లు చెప్పారు.