ముషీరాబాద్ టికెట్ కోసం గాంధీ నగర్ కార్పొరేటర్ పావని దరఖాస్తు

ముషీరాబాద్ టికెట్ కోసం గాంధీ నగర్ కార్పొరేటర్ పావని దరఖాస్తు

వచ్చే ఎన్నికల్లో  బీజేపీ నుంచి అసెంబ్లీ టికెట్ కోసం  దరఖాస్తు చేసేందుకు బీజేపీ స్టేట్ ఆఫీస్ కు ఆశావాహులు  తరలివస్తున్నారు. ఇవాళ లాస్ట్ డేట్ కావడంతో    పార్టీ ఆఫీసు కిక్కిరిసిపోయింది. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి  బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు గాంధీనగర్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్  అప్లై చేశారు. 

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో  శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బీజేపీ పార్టీ శ్రేణులతో భారీగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల బీజేపీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు ఆమె వెంట ఉన్నారు.

ALSOREAD:జనగాం టికెట్ నాదే..మెజార్టీతో ప్రజలే గెలపిస్తారు : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

ముషీరాబాద్  నియోజకవర్గం నుంచి హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి కూడా  అప్లై చేశారు. ఇక ఆరు రోజుల్లో మొత్తం 3,223 దరఖాస్తులు  వచ్చినట్లు సమాచారం. సెప్టెంబర్ 9న ఒక్కరోజే  1603 మంది ఆశావాహులు టికెట్ కోసం అర్జీ పెట్టుకున్నారు.