శిల్పారామంలో గాంధీ శిల్ప బజార్ మేళా షురూ

శిల్పారామంలో గాంధీ శిల్ప బజార్ మేళా షురూ

మాదాపూర్, వెలుగు: సంక్రాంతి పండుగ సందర్భంగా మాదాపూర్ శిల్పారామంలో ‘గాంధీ శిల్ప బజార్ మేళా’ను ఏర్పాటు చేశారు. హ్యాండీ క్రాప్ట్ డెవలప్​మెంట్ రీజినల్ డైరెక్టర్ లక్ష్మణ్ రావు, అడిషనల్ డైరెక్టర్ అపర్ణ,  శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు బుధవారం ప్రారంభించారు. మేళాలో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు150 స్టాల్స్ ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ నెల 17 వరకు మేళా కొనసాగుతుందని తెలిపారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా శిల్పారామంలో సంక్రాంతి సంబురాలు నిర్వహిస్తున్నట్లు శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు చెప్పారు.

పల్లెటూరు వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తామని తెలిపారు. అలాగే బుధవారం సాయంత్రం యాంపీ థియేటర్​లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.  నిర్మల విశ్వేశ్వర్ రావు శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనతో అలరించారు. సనాతన నర్తన గీతం, పుష్పాంజలి, భజమానస, గీతం, చక్కని తల్లికి, రామ గీతం, తాండవ నృత్య కారి, తరంగం, మంగళం అంశాలను ప్రదర్శించారు.