చెట్టు కోసం అహింసే ఆయుధంగా గాంధీ తాత చెట్టు మూవీ : పద్మావతి

చెట్టు కోసం అహింసే ఆయుధంగా గాంధీ తాత చెట్టు మూవీ : పద్మావతి

దర్శకుడు సుకుమార్‌‌‌‌‌‌‌‌ కూతురు సుకృతి వేణి ప్రధాన పాత్రలో పద్మావతి మల్లాది తెరకెక్కించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. నవీన్‌‌‌‌‌‌‌‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌‌‌‌‌‌‌‌, శేష సింధూరావు నిర్మించారు. ఈనెల 24న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకురాలు పద్మావతి మాట్లాడుతూ ‘మనమంతా, రాధేశ్యామ్‌‌‌‌‌‌‌‌, మహానటి లాంటి సినిమాలకు రైటర్‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేశా.  గాంధీ అనే అమ్మాయి, ఆమె తాత, ఆయన నాటిన చెట్టు మధ్య జరిగే కథ.  గాంధీ గారి సిద్దాంతమైన అహింస ఆయుధంగా ఊరిని, చెట్టును ఆమె ఎలా కాపాడింది అనేది మెయిన్  కాన్సెప్ట్.  ఇందులో గాంధీ పాత్రకు సుకృతి పర్‌‌‌‌‌‌‌‌ఫెక్ట్‌‌‌‌‌‌‌‌గా సెట్‌‌‌‌‌‌‌‌ అయ్యింది. ఈ సినిమా కోసం తను నిజంగానే గుండు చేయించుకుని డేరింగ్ డెసిషన్ తీసుకుంది.  

మెసేజ్‌‌‌‌‌‌‌‌తో పాటు కమర్షియాలిటీ ఉన్న సినిమా ఇది.  తప్పకుండా అందరి హృదయాలకు హత్తుకుంటుంది. ఈ సినిమాకు ఫిల్మ్‌‌‌‌‌‌‌‌ ఫెస్టివల్స్‌‌‌‌‌‌‌‌లో మంచి అప్లాజ్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. పంపించిన ప్రతి ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌లో అవార్డ్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. అవార్డ్స్ వల్ల సినిమాకు రెస్పెక్ట్‌‌‌‌‌‌‌‌ పెరిగింది. ముందుగా  క్రౌడ్ ఫండింగ్‌‌‌‌‌‌‌‌తో ఈ చిత్రాన్ని స్టార్ట్ చేశాం.  తెలుగు ఎన్‌‌‌‌‌‌‌‌ఆర్ఐ వాళ్లు ఒక వెబ్ సైట్ ద్వారా ఫండ్ రైజ్ చేశారు. దాదాపు 52 మంది ఈ సినిమాకు ఫండ్ ఇచ్చారు. తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ టేకోవర్ చేసుకున్నాక  ఇన్వెస్టర్లందరికీ లాభాలతో సహా డబ్బులు తిరిగి ఇచ్చేశాం’ అని చెప్పారు.