కవ్వాల్ టైగర్ జోన్ లో పనుల పరిశీలన

కడెం, వెలుగు : మండలంలోని ఉడుంపూర్  రేంజ్​ పరిధిలోని గండి గోపాల్ పూర్  బేస్  క్యాంప్, ఉడుంపూర్ కల్పకుంట గ్రాస్  ప్లాంట్​ను నేషనల్  టైగర్  కన్జర్వేషన్  అథారిటీ సభ్యులు పరిశీలించారు. ఎన్టీసీఏ సెక్యూరిటీ ఇన్​స్పెక్షన్​ టీమ్, మధ్యప్రదేశ్​ చీఫ్​ వైల్డ్  లైఫ్  వార్డెన్  అలోక్ కుమార్, అరుణాచల్​ప్రదేశ్​ వైల్డ్  లైఫ్  చీఫ్​ యోగేశ్, నిర్మల్  డీఎఫ్ వో రాంకిషన్, ఎఫ్డీవో భవాని శంకర్  శుక్రవారం టైగర్  రిజర్వ్  ఫారెస్ట్ లో వన్యప్రాణుల సంరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమాలపై ఆరా తీశారు.

 గ్రాస్  ప్లాంట్లతో పాటు అడవులు, వన్యప్రాణుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన నిఘా విభాగాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐ లవ్  కవ్వాల్  లోగో పరిశీలించారు. టైగర్​ రిజర్వ్​కు సంబంధించిన పూర్తి నివేదికలను ఎన్టీసీఏ, ఫారెస్ట్​ ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఎఫ్ఆర్వో శంకర్, డీఆర్వో ప్రకాశ్, ఫారెస్ట్​ సిబ్బంది పాల్గొన్నారు.