భూపాలపల్లి రూరల్, వెలుగు : సింగరేణి కార్మికులకు అండగా ఉంటానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చెప్పారు. భూపాలపల్లిలోని అంబేద్కర్ సెంటర్‌లో ఆదివారం నిర్వహించిన ఐఎన్‌టీయూసీ కార్మిక రణభేరి సభలో ఆయన మాట్లాడారు. ఐఎన్‌టీయూసీ విజయం సాధిస్తేనే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. గతంలో గుర్తింపు సంఘంగా విజయం సాధించిన టీబీజీకేఎస్ కార్మిక సమస్యలను పట్టించుకోలేదన్నారు.
కాంగ్రెస్ సహకారంతో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సభలో ఐఎన్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్ పసునుటి రాజేందర్, కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఐత ప్రకాశ్‌రెడ్డి, ఐఎన్టీయూసీ పాలపల్లి ఏరియా ఎన్నికల ఇన్‌చార్జి రమేశ్, బ్రాంచ్ కమిటీ నాయకులు పాల్గొన్నారు.