బీజేపీ, బీఆర్‌‌ఎస్ విమర్శల్ని తిప్పికొట్టాలి : గండ్ర సత్యనారాయణరావు

బీజేపీ, బీఆర్‌‌ఎస్ విమర్శల్ని  తిప్పికొట్టాలి : గండ్ర సత్యనారాయణరావు
  • భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

రేగొండ, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం నిత్యం విషం చిమ్ముతున్న బీజేపీ, బీఆర్​ఎస్​ దుష్ప్రచారానాన్ని తిప్పికొట్టాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పేర్కొన్నారు. ఆదివారం జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో రాజ్యంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు. పెద్ద బస్టాండ్​ నుంచి రేగొండ పోలీస్​ స్టేషన్​వరకు ప్రజలతో కలిసి సత్యనారాయణరావు పాదయాత్ర చేశారు. ఇందిరమ్మ, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాలులర్పించారు. 

ఈ సందర్భంగా సత్యనారాయణరావు మాట్లాడుతూ..  బీజేపీ దేశంలో మత రాజకీయాలను రెచ్చగొట్టి అల్లర్లను ప్రొత్సహిస్తుందన్నారు. బీజేపీ అధికారంలోని రాష్ట్రాల్లో ఈడీ దాడులు చేస్తూ  అడ్డదారిలో అధికారంలోకి వచ్చేందుకు చేస్తున్న కుట్రలను దేశ ప్రజలు గమనిస్తున్నారని ఆరోపించారు. భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్​ గూటోజు కిష్టయ్య, నాయకులు నడిపెల్లి విజ్జన్​రావు, నాయినేని సంపత్​రావు, ఇప్పకాయల నర్సయ్య, మ్యాకల భిక్షపతి, కొలెపాక సాంబయ్య, మైస భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.