మోరంచపల్లిలో విధ్వంసాన్ని మిగిల్చిన వరదలు

కొన్ని గంటల పాటు కురిసిన వర్షానికి వణికిపోయిన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామం ఇప్పుడిప్పుడే  తేరుకుంటుంది.  కాస్త వరద తగ్గుముఖం పట్టడంతో గ్రామస్థులు ఊపిరి పిల్చుకుంటున్నారు.  వరద ఉధృతితో గ్రామంలోని ఇళ్లు, రహదారులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. 

ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానలతో మోరంచ వాగుఉప్పొంగింది.  దీంతో ఊరిని మొత్తం వరద చుట్టుముట్టింది. ప్రజలు నిద్రలోచే లోపై ఊరంతా నీరు చుట్టుముట్టింది. దీంతో తమను తాము కాపాడుకోవడానికి చెట్టుకు ఒకరు, పుట్టకు ఒకరయ్యారు.సహాయం కోసం ఆర్థనాదాలు చేశారు.  

మోరంచపల్లిలో వరదలు విధ్వంసాన్ని మిగిల్చాయి. దాదాపు 5 మంది గల్లంతైన్నట్లుగా గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో తమవారిని కోల్పోవడంతో కన్నీటిపర్యంతం అవుతున్నారు కుటుంబ సభ్యులు.   

ALSO READ :జలదిగ్బంధంలో.. ఖమ్మం కాలనీలు

ఇక  భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మోరంచపల్లికి చేరుకున్నారు. దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. ఇంటింటికి తిరిగి బాధితులను పరామర్శించారు. బాధితుల క్షేమసమాచారాలు అడిగితెలుసుకున్నారు. ఎవరూ బాధపడొద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని దైర్యం చెప్పి బాధితులను ఓదార్చారు.