మొగుళ్లపల్లి, వెలుగు : గత పాలకుల నిర్లక్ష్యంతో రైతులు ఎన్నో కష్టాలు పడ్డారని, దండుగ అన్న వ్యవసాయం సీఎం కేసీఆర్ కృషితో పండుగలా మారిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు. నాబార్డ్ గ్రాంట్స్‌తో భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లిలో కట్టిన పీఏసీఎస్ గోడౌన్, కాంప్లెక్స్ రూమ్స్‌ను డీసీసీబీ మార్నేని రవీందర్‌రావుతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారం కోసం కాంగ్రెస్, బీజేపీ లీడర్లు ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఆ పార్టీలకు తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. నిరంతరం ప్రజల కోసం, గ్రామాల అభివృద్ధి కోసం పనిచేస్తున్న బీఆర్‌ఎస్‌నే గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, భూపాలపల్లి, చిట్యాల మార్కెట్ చైర్మన్లు కొడారి రమేశ్, లక్ష్మీనరసింహారావు, ఎంపీపీ సుజాత సంజీవరెడ్డి, జడ్పీటీసీలు జోరిక సదయ్య, పులి తిరుపతిరెడ్డి, సొసైటీ చైర్మన్ నర్సింగరావు, సర్పంచ్ నరహరి పద్మ వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు పాల్గొన్నారు.