మొగుళ్లపల్లి (టేకుమట్ల), వెలుగు : ఎలక్షన్ కోడ్ కారణంగా దళితబంధు, గృహలక్ష్మి స్కీమ్‌లు నిలిచిపోయాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య చెప్పారు. ప్రజలు మరోసారి బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే అధికారంలోకి రాగానే స్కీమ్‌లను యథాతథంగా అమలు చేస్తామని చెప్పారు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు.
కార్యకర్తలంతా ఏకతాటిపైకి వచ్చి బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, ఎంపీపీ మల్లారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల ప్రెసిడెంట్ సంగి రవి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సట్ల రవి పాల్గొన్నారు.