భూపాలపల్లి అర్బన్, వెలుగు : ఆలయంపై రాజకీయం చేసిన లీడర్లకు కోర్టు తీర్పు చెంపపెట్టు వంటిదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లిలోని వేంకటశ్వరస్వామి ఆలయ ఆవరణలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని శాఖల ఆఫీసర్ల కనుసన్నల్లోనే ఆలయ నిర్మాణం చేపట్టామని, కానీ వారు ఇప్పుడు కొత్తగా రాజకీయాలు చేయడం తగదన్నారు.
ఆఫీసర్లు ఇచ్చిన నోటీసులపై హైకోర్టులో అప్పీల్ చేయడంతో చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా అధికారులు ఫీల్డ్ లెవల్‌లో పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో బీఆర్‌ఎస్ లీడర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.