కేసీఆర్ పాలనలో ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు : గణేశ్ బిగాల

నిజామాబాద్ సిటీ, వెలుగు: కేసీఆర్ పాలనలో ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందించామని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గణేశ్ బిగాల తెలిపారు. బుధవారం  నగరంలోని 23, 6వ డివిజన్లలోని పద్మ నగర్, హనుమాన్ నగర్, వినాయక్ నగర్ లలో  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకి ఓటు వేసి మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.  బిగాల  మాట్లాడుతూ నగర అభివృద్ధి కళ్ల ముందే ఉందన్నారు.  నగరానికి ఐటీ హాబ్ మణి హారంగా మారి, స్థానిక యువతకు సాఫ్ట్ వేర్ కొలువులు అందించామన్నారు.

 మీరు మరొకసారి కారు గుర్తుకి ఓటు వేసి దీవిస్తే  నగరాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం, కార్పొరేటర్లు మల్లేశ్ యాదవ్, ఉమారాణి శ్రీనివాస్,  నాయకులు గుజేటి వెంకట నర్సయ్య, పాల్తీ రవి కుమార్, కులచారి సంతోష్, పుట్ట రాజేశ్, చిన్నం గారి గంగారెడ్డి, పాక సురేశ్, రమన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.