వినాయక చవితి వచ్చేసింది.. ఒకటీ రెండు రోజులు కాదు.. పది రోజులు పూజలు అందుకోనున్నాడు గణనాధుడు. చవితి రోజు మాత్రం ఇంటింటా గణపయ్యను పూజించనున్నారు. మరి పూజకు కావాల్సిన సామాగ్రి ఏంటో వివరంగా తెలుసుకుందాం.. హడావిడి పడకుండా ముందుగానే ఇంటికి తెచ్చుకుందామా...
>>> పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు
>>> పూలు, పూల దండలు, అరటి పండ్లు, కొబ్బరికాయలు, బెల్లం లేదా చక్కెర, పంచామృతం, తోరం
>>> కుందులు, నెయ్యి, నూనె, దీపారాధనకు వత్తులు
>>> 21 రకాల ఆకులు (పత్రి), ఒక గ్లాసులో చెంచా. ఆచమనం చేయడానికి మూడు తమలపాకులు, రెండు వక్కలు, రెండు పండ్లు, దక్షిణ ఉంచుకోవాలి. ఆచమనం చేసిన తరువాత చేతులు తుడుచుకోవడానికి ఒక తువ్వాలు. పూజ చేసేవాళ్లు బొట్టు పెట్టుకొని పీటపై కూర్చోవాలి.
వినాయకుడితోపాటు ఈ పూజా సామాగ్రి అంతా పూజకు రెడీ చేసుకుంటే.. ప్రశాంతంగా ఆ గణపతిని ఆరాధించి.. కోరిక కోర్కెలను తీర్చుకోవచ్చు..
ALSO READ | గణపతి నవరాత్రి ఉత్సవాలు : ఏ రోజు ఎలా పూజించాలి.. నైవేద్యం ఏమి పెట్టాలో తెలుసా..