
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 18న వినాయకచవితి వేడుకలు ఘనంగా జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో సెప్టెంబర్ 19న జరుపుకున్నారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రతి వీధిలో గణనాథులను ప్రతిష్ఠించారు. ప్రత్యేక పూజలు చేసి గణనాథుని ఆశీస్సులు అందుకున్నారు. అయితే తాజాగా ఇండియన్ ఫారెస్ట్ అధికారి (IFS) సుశాంత నంద దేశ ప్రజలకు X టిట్టర్ లో ఒక వీడియోను పోస్టు చేస్తూ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియో గతంలో రికార్డ్ చేసిందైనా... గణేష్ చతుర్థి రోజు పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.
"Ekadantaya vakratundaya Gauri tanaya ya dhimahi
— Susanta Nanda (@susantananda3) September 19, 2023
Gajeshanaya bhalchandraya Shree ganeshaya dhimahi"
Blessed Ganesh Chaturthi to you all? pic.twitter.com/94TMzigaIf
ఈ వీడియోలో దట్టమైన అటవీ ప్రాంగణంలోని పొదల్లోంచి ఏనుగు తొండాన్ని ఊపుకుంటూ బయటకు వచ్చింది. అయితే అది ఓ వాహనం వైపు పరిగెత్తడానికి ప్రయత్నించి ... వీడియోను రికార్డింగ్ చేస్తున్న వ్యక్తిని గమనించి ఒక్కసారిగా ఆగిపోయినట్లు వీడియోలో స్పష్టంగా ఉంది. ఈ వీడియోకు ఇండియన్ ఫారెస్ట్ అధికారి (IFS) సుశాంత నంద ఏకదంతాయ వక్రతుండాయ - అనే పద్యంతో పోస్ట్ చేశారు. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయా యా ధీమహి. ... గజేశానాయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. అని రాసకతూ అందరికి గణేష్ చతుర్ది శుభాకాంక్షలు అని రాశారు. ఈ వీడియో గణేష్ చతుర్ధి రోజున రిలీజ్ చేశారు. హిందువులు భక్తితో ఏనుగులను పూజిస్తారు. అందులో గజరాజు అనగా వినాయకుడు అంటారు, ఈ వీడియో అతి కొద్ది సమయంలోనే 22 వేల 800 వీక్షణలను పొందింది.
ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందించారు. చాలా మంది ప్రార్థన చేస్తున్నట్లు నమస్కారం (దండం) పెట్టి భక్తి ప్రవృత్తిని చాటుకున్నారు. మరి కొంతమంది గణేష్ చతుర్థి రోజున ఏకదంత ఏనుగును చూడటం చాలా ఆనందంగా ఉందని పోస్ట్ చేశారు. మరో వ్యక్తి ధన్యవాదాలు అని రాస్తూ గజరాజుగురించి వర్ణించడానికి పదాలు రావడం లేదని చమత్కరించారు.
గతేడాది గణేష్ చతుర్థి రోజున ఓ మహిళ తన బిడ్డతో ఏనుగు ఆశీర్వాదం తీసుకున్న వీడియో కూడా వైరల్ అయింది. ఈ వీడియోను IPS అధికారి దీపాంషు కబ్రా X ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలుపుతూ... గణేషుడిని ప్రార్థిస్తే జీవితంలో కష్టాలు తొలగి .. మీకు ఆనందం... విజయాన్ని గణేషుడి అనుగ్రహిస్తాడని ట్విట్టర్ లో తెలిపారు. ని
आप सभी को गणेश चतुर्थी की ढेरों शुभकामनाएं. विघ्नहर्ता सभी की प्रार्थना स्वीकार करें एवं खुशहाली, समृद्धि और सफलता का आशीर्वाद दें.#HappyGaneshChaturthi#GanpatiBappaMorya pic.twitter.com/71qL3M7Uhs
— Dipanshu Kabra (@ipskabra) August 31, 2022