గణేశ్ ఉత్సవాలకు అనుమతిచ్చిన కర్ణాటక హైకోర్టు

గణేశ్ ఉత్సవాలకు అనుమతిచ్చిన కర్ణాటక హైకోర్టు

ఈద్గా మైదానంలో గణేశ్ చతుర్థి వేడుకలకు కర్ణాటక హైకోర్టు అనుమతించింది . హుబ్బళ్లి- ధర్వాడ్ లోని ఈద్గా మైదానంలో వినాయక చవితి వేడుకలు అనుమతిస్తూ రాత్రి తీర్పు వెల్లడించింది. నవరాత్రి వేడుకలు ప్లాన్ ప్రకారం నిర్వహించాలని సూచించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. హుబ్బుళ్లి ఈద్గా మైదానంలో గణేశుని వేడుకల కోసం నగర మున్సిపల్ కమిషన్ అనుమతించారు. కానీ దీనికి వ్యతిరేకంగా అంజుమన్ ఏ ఇస్లాం సంస్థ హైకోర్టుకు వెళ్లింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఈద్గా ఆస్తి ధార్వాడ్ మున్సిపాలిటీకి చెందిందని.. అంజుమన్ ఏ ఇస్లాం సంవత్సరానికి ఒక్క రూపాయి రుసుముతో 999 ఏళ్లకు గానూ లీజుదారుగా మాత్రమే ఉందన్నారు.

 



కోర్టు తీర్పు రాగానే.. అర్ధరాత్రి నుంచే ఈద్గా మైదానంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకల కోసం వినాయక మండపాన్ని నిర్మించి.. వినాయకుడ్ని ప్రతిష్ఠించారు. భక్తుల కోసం క్యూలైన్ల ఏర్పాటు చేశారు. పూజలు నిర్వహించి  భక్తుల్ని అనుమతిస్తున్నారు.