డ్యాన్స్ చేశాడు.. లడ్డు వేలం పాడాడు.. ఇంటికెళ్లాక గుండెపోటుతో చనిపోయాడు !

డ్యాన్స్ చేశాడు.. లడ్డు వేలం పాడాడు.. ఇంటికెళ్లాక గుండెపోటుతో చనిపోయాడు !

రంగారెడ్డి జిల్లా: మణికొండలో విషాద ఘటన జరిగింది. భాగ్యనగరమంతా గణేశ్ నిమజ్జనం సందడిలో ఉండగా మణికొండ మున్సిపాలిటీ పరిధిలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. అల్కాపూర్ టౌన్షిప్ దగ్గర ఏర్పాటు చేసిన గణేష్ మండపం దగ్గర శ్యామ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫుల్ జోష్తో డ్యాన్స్ చేసి సందడి చేశాడు. లడ్డు వేలం పాటలో కూడా యాక్టివ్గా పాలుపంచుకున్నాడు. రూ.15 లక్షల 75 వేల వరకు శ్యామ్ లడ్డు వేలం పాడాడు. 

అయితే రూ.16 లక్షలకు సురేష్ వొక్క అనే వ్యక్తి గణేశ్ లడ్డును వేలం పాటలో  సొంతం చేసుకున్నాడు. వేలం పాటలో లడ్డును దక్కించుకోలేకపోయినప్పటికీ లైట్ తీస్కోని శ్యామ్ ఇంటికెళ్లి రెస్ట్ తీసుకున్నాడు. రెస్ట్ తీసుకుందామని పడుకున్న కాసేపటికే గుండెపోటుతో శ్యామ్ ప్రాణాలు కోల్పోయాడు. హాస్పిటల్కు తరలించే లోపే శ్యామ్ ప్రాణం పోయింది.

వినాయక చవితి పండుగను కుటుంబం, స్థానికులతో కలిసి శ్యామ్ ఘనంగా జరుపుకున్నాడు. నిమజ్జనం సమయానికి ఇలా జరగడంతో శ్యామ్ కుటుంబం మాత్రమే కాదు స్థానికులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. నిన్నమొన్నటి వరకూ తమతో కలిసి గణేశ్ పండగను సెలబ్రేట్ చేసుకున్న శ్యామ్ ఇక లేడనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. 

ALSO READ : ఊరేగింపులో ఉద్రిక్తత.. పోలీస్ వాహనంలోనే నిమజ్జనానికి విగ్రహం

అల్కాపూర్ టౌన్షిప్  రోడ్ నెంబర్ 28 అపార్ట్మెంట్లో శ్యామ్  నివాసం ఉంటున్నాడు. శ్యామ్ స్వస్థలం కర్నాటకలోని రాయచూర్ అని తెలిసింది. అల్కాపూర్ టౌన్ షిప్కు శ్యామ్ వెళ్లి స్థిరపడి సుమారు 10 సంవత్సరాలు అయినట్లు స్థానికులు తెలిపారు. అల్కాపూర్ టౌన్షిప్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈసీ మెంబర్గా కూడా శ్యామ్ కొనసాగాడు. అతనికి పెళ్లయి ఒక బాబు కూడా ఉన్నాడు. శ్యామ్ కొడుకు 7th క్లాస్ చదువుతున్నాడు. తీన్మార్ డ్యాన్స్ చేసి, గణేశ్ పండుగను సంతోషంగా జరుపుకున్న శ్యామ్ కు ఇలా జరగడంతో అతని కుటుంబం మొత్తం షాక్లో ఉంది.