![ట్యాంక్ బండ్ వద్దకు తరలివస్తున్న గణనాథులు](https://static.v6velugu.com/uploads/2022/09/ganesh-immersion-continuing-on-the-second-day-at-hyderabad_fQFvYGzi8Z.jpg)
హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనాలు కంటిన్యూ అవుతున్నాయి. ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనానికి గణనాథులను ఇంకా తరలి వస్తున్నాయి. నగరంలోని కొందరు మండపాల నిర్వాహకులు నిన్న శుక్రవారం కావడంతో వినాయకులను ఇవాళ నిమజ్జనానికి తీసుకొస్తున్నారు. ట్యాంక్ బండ్ మీద ఇప్పటికీ ఫుల్ రష్ కొనసాగుతోంది.
సాయంత్రం వరకు నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. ఇంకా కొన్ని విగ్రహాలు నిమజ్జనానికి ట్యాంక్ బండ్ కు తరలి వస్తుండటంతో.. పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగిస్తున్నారు. ట్యాంక్ బండ్ రూట్ల లోని ట్రాఫిక్ ను ఇతర మార్గాలకు మళ్లిస్తున్నారు. మరోవైపు వినాయక నిమజ్జనాన్ని చూసేందుకు ఇవాళ కూడా ప్రజలు ట్యాంక్ బండ్ వద్దకు తరలి వస్తున్నారు. వారాంతం కావడంతో ఎంతోమంది తమ పిల్లల్ని తీసుకొచ్చి వినాయక నిమజ్జనం ఎలా జరుగుతుందనేది చూపిస్తున్నారు. వినాయక విగ్రహాలతో తరలివచ్చే వాహనాలు, జై బోలో గణేశ్ మహరాజ్ కీ నినాదాలతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఆధ్యాత్మిక సందడి కనిపిస్తోంది.