వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లా వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనం

‘జై బోలో గణేశ్‌‌‌‌‌‌‌‌ మహరాజ్‌‌‌‌‌‌‌‌కీ జై, గణపతి బప్పా మోరియా’ నినాదాలతో వరంగల్‌‌‌‌‌‌‌‌ ట్రై సిటీ మారుమోగింది. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణపయ్య బుధవారం గంగ ఒడిని చేరుకున్నాడు. ఉమ్మడి వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లా వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక విగ్రహాలను అందంగా

అలంకరించిన ట్రాక్టర్లు, లారీల్లో ప్రతిష్ఠించి ప్రధాన వీధుల్లో డప్పుచప్పుళ్లు, డీజే, తీన్మార్‌‌‌‌‌‌‌‌ పాటలు, కోలాటాల నడుమ శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం చెరువుల్లో నిమజ్జనం చేశారు. వినాయక మండపాల వద్ద లడ్డూ వేలం నిర్వహించారు.