గణేష్ నిమజ్జనంలో తప్పిన పెను ప్రమాదం

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో గణేష్ నిమజ్జనంలో పెను ప్రమాదం తప్పింది. నిన్న రాత్రి(సెప్టెంబర్ 26) సూరారం కట్టమైసమ్మ లింగం చెరువు కట్టపై జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన క్రేన్ గొలుసు ఊడిపోయింది. దీంతో క్రైన్ పైన పెట్టిన వినాయక విగ్రహం అదుపుతప్పింది. దీంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. 

Also Read : నల్లగొండ ఓల్డ్సిటీ గణేషుడి లడ్డూ @ 36 లక్షలు

డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల గణేష్ నిమజ్జనం చేస్తుండగా క్రేన్ గొలుసు ఊడిపోయిందని స్థానికులు చెప్పారు. వెంటనే సమీపంలో ఉన్న వారిని పోలీసులు పక్కకు నెట్టారు. దీంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.