జగిత్యాలలో గణేశ్​నవరాత్రుల లడ్డు వేలం

జగిత్యాల టౌన్/వేములవాడ, వెలుగు : గణేశ్​నవరాత్రుల ముగింపు సందర్భంగా పట్టణంలోని వెలమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణపతి మండపంలో లడ్డూ వేలం నిర్వహించారు. రాంపూర్ గ్రామానికి చెందిన షోరవ్ దంపతులు లక్ష 62వేలకు లడ్డును వేలం పాటలో దక్కించుకున్నారు.

అష్టలక్ష్మి గణపతి ఆలయంలోని లడ్డును చిన్నపరెడ్డి నరసింహులు లక్ష 25వేలకు దక్కించుకున్నారు. అలాగే వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం, ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద లడ్డూను వేలంలో పట్టణానికి చెందిన చేపూరి గణేష్ స్వరూప దంపతులు రూ. 35 వేల 116 కు దక్కించుకున్నారు.