ట్యాంక్‌బండ్‌పై కుప్పకూలిన గణేష్ విగ్రహం.. ఫుల్ ట్రాఫిక్ జామ్

ట్యాంక్‌బండ్‌పై కుప్పకూలిన గణేష్ విగ్రహం.. ఫుల్ ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ : గణేష్ నవరాత్రుల సందర్భంగా మండపానికి తరలిస్తున్న గణేష్ విగ్రహం ట్యాంక్ బండ్ మెయిన్ రోడ్డుపై కుప్పకూలిపోయింది. దీంతో ట్యాంక్ బండ్ రోడ్డుపై భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. బడా గణేష్ విగ్రహాన్ని బుధవారం దూల్‌పేట్ నుంచి మేడ్చల్ తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రాలీ మీద ఉన్న వినాయక విగ్రహం అదుపుతప్పి ఒక్కసారిగా వెనుకకు పడిపోయింది. 

Also Read:-ఈ నెల 7, 17న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

రద్దీ ఎక్కువగా ఉండే మార్గం కావడంతో క్షణ్ణాల్లోనే వాహనాలన్నీ జామ్ అయ్యాయి. స్థానికులు, సివిల్, ట్రాఫిక్ పోలీసుల సహాయంతో విగ్రహాన్ని రోడ్డు మీద నుంచి తరలిస్తున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పోలీసులు కష్టపడుతున్నారు.