గణేష్ నిమజ్జనం..హుస్సేన్ సాగర్ చుట్టూ 3 వేల మంది పోలీసులు

గణేష్ నిమజ్జనం..హుస్సేన్ సాగర్ చుట్టూ 3 వేల మంది పోలీసులు

హైదరాబాద్ లో వినాయక నిమజ్జనానికి జీహెచ్ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  గ్రేటర్ హైదరాబాద్లో సెప్టెంబర్ 17న  దాదాపు లక్ష విగ్రహాలను నిమజ్జనానికి తరలి రానున్నన్నాయి. ట్యాంక్ బండ్,ఎన్టీఆర్ మార్గ్,పీవీ మార్గ్ లో  నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేశారు.   నిమజ్జనం బందోబస్తు కోసం 25 వేల మంది పోలీసులను సిద్ధం చేశారు.   నిమజ్జన ఏర్పాట్లపై గత రెండు నెలలుగా కసరత్తు చేసిన పోలీసులు.. కేవలం హుస్సేన్ సాగర్ చుట్టూ 3 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఖైరతాబాద్ గణేశుడి విగ్రహాన్ని సెప్టెంబర్ 17న మధ్యాహ్నం 1.30 గంటలలోపు నిమజ్జనం చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బాలాపుర్ వినాయకుడు హుస్సేన్ సాగర్ దగ్గరికి చేరుకునే అవకాశముంది.   మహిళల భద్రత కోసం  హుస్సేన్ సాగర్  పరిసర ప్రాంతాల్లోనే 12 షీటీమ్స్  ఏర్పాటు చేశారు.    సెప్టెంబర్ 17 ఉదయం 6 గంటల నుంచి 18న రాత్రి 11 గంటల వరకు భారీ వాహనాలు , ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు  నగరంలోకి అనుమతి లేదు.