హైదరాబాద్ : మాసాబ్ ట్యాంక్ లోని Aqeeq రెస్టారెంట్ పార్కింగ్ లో స్విగ్గీ డెలివరీ బాయ్ పై గ్యాంగ్ ఎటాక్ జరిగింది. రెస్టారెంట్ బయట పార్కింగ్ లో స్విగ్గీ డెలివరీ బాయ్ తో లోకల్ గ్యాంగ్ గొడవపడింది. అందరు కలిసి కొట్టడంతో డెలివరీ బాయ్ భయపడి.. రెస్టారెంట్ కిచెన్ లోకి పరుగెత్తుకుంటూ వెళ్లాడు. కిచెన్ లో పని చేస్తున్న సిబందిపైనా దాడి చేశారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే వేడి నూనె రెస్టారెంట్ సిబ్బంది సోను, ఇలియాజ్, సజ్జల్ మీద పడటంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇద్దరికి సుమారు 80 శాతం కాలడంతో వారి పరిస్థితి సీరియస్ గా ఉంది. మరో వ్యక్తికి 40 శాతం శరీరం కాలిందని డాక్టర్స్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్ధానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.