అది బెంగళూరులోని ఒక గేటెడ్ కమ్యూనిటీ, అందులోని ఒక విల్లాలో ఒక మహిళ, తన ఇద్దరు కుమారులు ఉన్నారు. మధ్యాహ్నం 12, 1 గంట ప్రాంతంలో ఆ ఇంటి కాలింగ్ బెల్ రిపీటెడ్ గా మోగుతుండటంతో ఆమె చిన్న కొడుకు డోర్ ఓపెన్ చేశాడు. తర్వాత ఒక కంపెనీ నుండి వచ్చిన సేల్స్ మెన్ ని అంటూ ఒక వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. ఆ వెంటనే ఫేస్ మాస్క్, హెల్మెట్ ధరించిన మరో ఇద్దరు ఇంట్లోకి చొరబడ్డారు.
అలికిడి విన్న తల్లి బయటకు రాగా తాము దొంగలమంటూ తుపాకీ పెట్టి బెదిరించి ఇంట్లోకి చొరబడి లక్ష రూపాయలు విలువ చేసే సెల్ ఫోన్స్, వెండి వస్తువులు, 10వేల రూపాయల నగదును దొంగలించారు. కర్ణాటకలోని ఎలహంక ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
బాధితులు పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం దోపిడీదారులు హిందీలో మాట్లాడారని, వారి యాసని బట్టి చుస్తే బెంగళూరుకు సంబంధించిన వారు కాదని తెలుస్తుందని పోలీసులు అన్నారు. దుండగులను పట్టుకొని విచారించిన తర్వాతనే అవి నిజం తుపాకులా కాదా అన్నది తెలుస్తుందని పోలీసులు తెలిపారు.