మెట్రో రైలులో మహిళా గ్యాంగ్ దొంగతనాలు

మెట్రో రైలులో మహిళా గ్యాంగ్ దొంగతనాలు

దేశ రాజధాని ఢిల్లీ నిత్యం బీజీగా ఉండే ప్రాంతం ..బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు.. షాపింగ్ మాల్స్.. ఇలా అన్ని ప్రాంతాలు రద్దీగా ఉంటాయి. అలాంటి ప్రదేశాల్లో ఢిల్లీ రాజీవ్ చౌక్ రైల్వే స్టేషన్ ఒకటి.. నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటుంది. కొత్త విషయం ఏం కాదు .. అయితే ఏంటీ అంటారా.. ఇప్పుడు రాజీవ్ చౌక్ రైల్వే స్టేషన్ కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని ఢిల్లీ పోలీసులు పోస్ట్ చేశారు.. వివరాల్లోకి వెళితే.. 

రాజీవ్ చైక్ స్టేషన్ లో ముగ్గురు మహిళల ముఠా ఓ ప్రయాణికుడిని  దోచుకుంటున్న వీడియో ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది. ఇది ఆ వీడియోలో మహిళ తమ టార్గెట్ అయిన ప్రయాణికురాలిని చుట్టుముట్టి దోచుకుంటున్న దృశ్యాలను చూపిస్తోంది.ముగ్గురు పిక్ పాకెటర్లు ఓ ప్రయాణికురాలి బ్యాగ్ లోని వస్తువులను దొంగిలించేందుకు గుంపుగా చేరడం.. ఆ ప్రయాణికురాలిని ఒకామె టార్గెట్ గా గుంపు మధ్య దుపట్టాతో కప్పడం.. మరో ఇద్దరు ఆమెకు ఇరుపక్కల నిలబడటం.. రద్దీ ఉన్నట్లు టార్గెట్ చేసిన ప్రయాణికురాలిని నెట్టుకుంటూ వచ్చిన పని చేసుకొని అక్కడ నుంచి జారుకున్న తీరు ఈ వీడియోలో కనిపిస్తుంది. 

ఈ ఏడాది ప్రారంభం, ఆగస్టులో  ఢిల్లీ మెట్రో రైలు ప్రయాణికులను పిక్ పాకెటింగ్ చేస్తున్న మహిళ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వారి కార్యకలాపాల నిర్వహణకు గురించి మీడియాకు వివరిస్తూ ఈ వీడియోను మీడియాకు చూపించారు. దీంతో ఈ వీడియో బయటకు వచ్చింది. దొంగతనానికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. నిందితులను ఢిల్లీలో ఆనంద్ పర్బత్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.