హనుమకొండ సిటీ, వెలుగు : ఉదయం కాలేజీ వెళ్లి చదువుకుంటూ రాత్రి బైక్ దొంగతనాలు చేస్తున్న నలుగురు ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గురువారం సుబేదారి పోలీసు స్టేషన్ లో సీఐ సత్యనారాయణ రెడ్డి, ఏసీపీ దేవేందర్ వివరాలు వెల్లడించారు. పరకాల మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ముస్కుల అఖిల్ (23), ముస్కుల అభిరాం(19),ముస్కుల సిద్దార్ధ (20)
ముస్కుల మధుసూదన్(22) అనే నలుగురు హనుమకొండ లోని మచిలీబజార్ ఉంటూ వివిధ కాలేజీల్లో చదువుతున్నారు. ఉదయం కాలేజీకి వెళుతూ రాత్రి సమయంలో బైక్ లు దొంగతనం చేస్తున్నారు. సుబేదారి ఎస్సై గాలిబ్ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా నలుగురు నిందితులు పట్టుబడగా.. దొంగతనాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నారు.