గడ్డి మందులు కూడా నకిలీవేనని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. రైతులను దగా చేస్తున్న నకిలీ పురుగు, గడ్డి మందుల తయారు చేస్తున్న.. రెండు ముఠాలను అరెస్ట్ చేశామన్నారు. రెండు ముఠాల నుంచి 11 మందిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. మరికొంతముంది పరారీలో ఉన్నారని చెప్పారు. వీరినుంచి నాలుగు డీసీఎంల లోడ్ నకిలీ పురుగు మందులు ఇతరసామాగ్రి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
అరెస్ట్ అయిన వారి నుంచి పోలీసులు రూ. 57 లక్షల విలువైన నకిలీ , గడువు తీరిన పురుగుల మందులు, నిషేధిత గడ్డి మందు, నకిలీ పురుగు మందులు తయారీకి అవసరమైన రసయానాలు, ప్రింటింగ్ సామగ్రి, ఖాళీలు బాటిల్స్, రవాణాకు వినియోగించే ఒక కారు, స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ. 24 లక్షల విలువైన గడువు తీరిన పురుగు మందులు, రూ. 30 లక్షల విలువగల నకిలీ పురుగు మందులు, రూ. 3లక్షల 53వేల ప్రభుత్వ నిషేదిత గడ్డి మందులు ఉన్నాయన్నారు.నిందితులపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేశామని కమిషనర్ తెలిపారు.
ALSO READ :మహిళల్ని నడిరోడ్డుపై నగ్నంగా ఊరేగించినా మోదీ మౌనం వీడరా?: గౌరవ్ గొగొయ్
నకిలీ పురుగుల, గడ్డి మందులను హైదరాబాద్ లో తయారీ చేసి.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయాలు జరుపుతున్నామని ముఠాసభ్యులు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కోట్లాది రూపాయల నకిలీ పురుగు మందులు, కాలం చెల్లినవి విక్రయాలు జరిగాయన్నారు.