వీళ్లు మామూలోళ్లు కాదు.. పోలీస్ యూనిఫామ్లోనే చోరీలు.. చివరికీ..

వీళ్లు మామూలోళ్లు కాదు.. పోలీస్ యూనిఫామ్లోనే చోరీలు.. చివరికీ..

ఖమ్మం:  ఏపీ, తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, తమిళనాడులో పలు ఇండ్లలో చోరీలకు పాల్పడుతూ ప్రజలకు, పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఘరానా దొంగల ముఠాను ఇవాళ వైరా పోలీసులు అరెస్ట్​చేశారు.   సర్వే పేరుతో  ఇంట్లోని చొరబడి వృద్దురాలి వద్ద బీరువాలోని నగలు, క్యాష్​ ఎత్తుకెళ్లిన ఘటన  ఖమ్మం​లో సంచలనం సృష్టించింది. 

ఈ కేసు వైరా పోలీసులు ఛేదించారు.   ఇందుకు సంబంధించి నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను  అరెస్ట్​ చేసిన్నట్లు తెలిపారు. వీరి నుంచి  35 లక్షల విలువైన సొమ్మును రికవరీ చేసిన్నట్లు పోలీసులు చెప్పారు.  ఖమ్మం సీపీ సునీల్​దత్​ వివరాలను మీడియాకు వెల్లడించారు.  వైరా లీలా సుందరయ్య నగర్​లో ఓ వృద్దురాలి ఇంట్లోకి పోలీసు యూనిఫార్మ్​లో వచ్చి  మీ కొడుకు గంజాయి అమ్ముతున్నాడని ఇంట్లో సోదాలు చేయాలని నలుగురు దొంగల ముఠా ప్రవేశించిందన్నారు.   

ALSO READ | సైబర్ మోసానికి కొత్త ప్లాన్: పాత ఫోన్లకు టిఫిన్ బాక్సులు ఇచ్చి.. బీహారీ గ్యాంగ్ డేటా చోరీ..

సర్వే పేరుతో వృద్దురాలి   ఇంట్లోకి చొరబడి బీరువాలోని నగలు, క్యాష్​దొంగిలించిన్నట్లు తెలిపారు.   కేసు దర్యాప్తులో భాగంగా  వైరా పోలీసులు ఇంటర్​స్టేట్​బోర్డర్​లో వెహికల్​చెకింగ్​చేస్తుండగా నలుగురు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకోని విచారిస్తే అసలు విషయం బయటకు వచ్చిందన్నారు.  వీరి నుంచి  రూ. 35 లక్షల క్యాష్​,  రెండు కార్లు, బంగారం, కత్తులు, మారణాయుధాలు, నకలీ పోలీసు యానిఫార్మ్​లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.