
- పోలీసులకు కుటుంబ సభ్యుల కంప్లయింట్
శంషాబాద్, వెలుగు: ఆటోలో ఎక్కిన మహిళను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్‌రేప్ చేసిన ఘటన రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో జరిగింది. రాజేంద్రనగర్ సీఐ కనకయ్య తెలిపిన ప్రకారం.. సిటీలోని పురానాపూల్‌కు చెందిన మహిళ(30) బుధవారం హైదర్ గూడకు పని మీద వచ్చింది. తిరిగి పురానాపూల్ వెళ్లేందుకు ఆటో ఎక్కింది. మహిళ ఒంటరిగా ఉండగా, ఆటోలోని వ్యక్తులు హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా పోనిచ్చారు. లార్డ్స్ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెకు మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి కుటుంబసభ్యులు గురువారం రాజేంద్ర నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు ఫైల్ చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.