దుప్పి మాంసం అమ్ముతున్న ముఠా అరెస్ట్

దుప్పి మాంసం అమ్ముతున్న ముఠా అరెస్ట్

దుప్పి(మగ జింక) మాంసం అమ్ముతున్న ముఠాను విశ్వసనీయ సమాచారం మేరకు శంషాబాద్ జోన్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వారు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలానికి చెందిన బి వెంకటేష్(34), నల్గొండ జిల్లా మర్రిగూడ మండలానికి చెందిన ఎం శ్రీను(37), రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలానికి చెందిన పి కరుణాకర్(35) వద్ద కొనుగోలు చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పహాడ్ వద్ద విక్రయిస్తున్నాడు. 

సమాచారం అందుకున్న  ఎస్ఓటీ పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2 కిలోల జింక మాంసం,14 కిలోల దుప్పి మాంసం 2 బైక్స్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.