అంబులెన్స్లో గంజాయి.. నలుగురు అరెస్ట్

జగిత్యాల: అంబులెన్సులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఓ ముఠాను జగిత్యాలలో పోలీసులు అరెస్ట్ చేశారు.  వైజాగ్ నుంచి రాజస్థాన్ కు ఓ  ప్రైవేట్ అంబులెన్సులో గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను సాంగపూర్ చెక్ పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్, మహబూబాబాద్ కి చెందిన  నలుగురుని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 70 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంబులెన్స్ ను సీజ్  చేసిన పోలీసులు నిందితులను రిమాండ్ కు తరలించారు.