బీఎస్పీ గెలుపునకు కృషి చేయాలి: గైని గంగాధర్

బోధన్, వెలుగు:  బోధన్​లో బీఎస్పీ  గెలుపునకు కృషి చేయాలని  జిల్లా  ఇన్​చార్జి గైని గంగాధర్​ కోరారు. ఆదివారం బోధన్​లోని బీఎస్పీ ఆఫీసులో  నియోజకవర్గంలోని ముఖ్యకార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.  అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో కార్యకర్తలు సైనికులుగా  పనిచేయాలని సూచించారు.  తమ పార్టీ విధివిదానాలను గ్రామగ్రామాన తీసుకవెళ్లి ప్రజలకు వివరించి చైతన్యం  చేయాలన్నారు. ఇప్పటికే బూత్​ కమిటిలు, శిక్షణ తరగతులు నిర్వహించినట్టు తెలిపారు.

 ప్రతి  మండలంలోని పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేయాలని సూచించారు. రాబోవు ఎన్నికలలో బీఎస్పీ పార్టీని అధికమెజార్టీతో గెలుపించుకోవడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఇంచార్జీ సింగాడే పాండు, అసెంబ్లీ ఉపాధ్యక్షుడు ఎన్​.శంకర్​, బోధన్​ పట్టణ అధ్యక్షుడు గోపాల్​, మండల అధ్యక్షుడు యూసుఫ్​, నాయకులు బాగారే  గంగాధర్​, కిరణ్​కుమార్​, మారుతి, గ్రామ కమిటిలు, బూత్​ కమిటిల ఇంచార్జీలు, కార్యకర్తలు  పాల్గోన్నారు.