- గంగాధర్ మదనం
సంగారెడ్డి, వెలుగు: సంచార జీవితం, బాల కార్మికుడిగా, పేపర్ బాయ్ గా ప్రస్థానాన్ని ప్రారంభించి డీఎస్పీ స్థాయికి ఎదిగిన తనకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని గంగాధర్ మదనం జిల్లా పట్టభద్రులను కోరారు. సోమవారం సంగారెడ్డిలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి మెదక్ జిల్లా చేగుంట మండలం నార్సింగ్ ప్రాంతానికి చెందిన తాను ఎస్ఐగా కెరియర్ ప్రారంభించి అంచలంచెలుగా డీఎస్పీ స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు.
సంచార జాతికి చెందిన వాడిగా అన్ని వర్గాలతో, 26 ఏళ్ల సుదీర్ఘ పోలీస్ వృత్తిలో ఉన్న అనుభవంతో పేదవాడి గొంతుకగా వినిపించడానికి చట్టసభలే సరైన వేదిక అని భావించి రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.