ఆలయాల్లో ఎమ్మెల్యే సత్యం పూజలు 

ఆలయాల్లో ఎమ్మెల్యే సత్యం పూజలు 

గంగాధర, వెలుగు :  గంగాధర మండలం ఉప్పరమల్యాల తుమ్మెదలగుట్ట లక్ష్మీనరసింహస్వామి, గర్శకుర్తి వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల్లో స్వామి వారి కల్యాణోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఆయన వెంట జడ్పీటీసీ పుల్కం అనురాధ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పురుమళ్ల మనోహర్, నాయకులు గంగన్న, చక్రపాణి, లక్ష్మీనారాయణ, భాస్కర్, మల్లేశం, కరుణాకర్​, అన్నల్​దాస్ శ్రీనివాస్, రాజేశం, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.