పథకాల పేరుతో సర్కార్​ మభ్యపెడుతోంది: గంగాడి కృష్ణారెడ్డి

హుజురాబాద్,​ వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో అట్టర్ ప్లాప్ అయిందని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం హుజూరాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద  బీజేపీ లీడర్లు రాస్తారోకో నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ 2014, 2018 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నేటికీ అమలు చేయలేదన్నారు. 

సీఎం కేసీఆర్​మాయమాటలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. లీడర్లు మాడ వెంకట్​రెడ్డి, సంపత్ రావు, కరుణాకర్, మహేందర్ గౌడ్,   రాజు, మల్లేశ్, వేణు, శ్రీనివాస్, కొండాల్ రెడ్డి, ప్రవీణ్, రవి, స్వరూప, చంద్రిక, విజయ్,  తిరుపతిరెడ్డి,  సంజీవ్, సంపత్, సంజీవరెడ్డి,  తిరుపతి, కొమురయ్య, సదానందం, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ యాదవ్,  బీఆర్ గౌడ్, నాగరాజు పాల్గొన్నారు.