ఆసిఫాబాద్ జిల్లాలో గంగాపూర్ ​పంచాయతీ ఆఫీస్ కు​ తాళం 

కాగజ్ నగర్, వెలుగు : ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం గంగా పూర్ గ్రామ  పంచాయితీకి గ్రామస్తులు తాళం వేశారు. వచ్చిన నిధులు కనీసం పాలకవర్గం తీర్మానం లేకుండానే సొంతానికి వాడుకున్నారని సోమవారం గ్రామ సభలో ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు గ్రామస్తులు సర్పంచ్ ను నిలదీశారు. సమాధానం చెప్పలేక సర్పంచ్ మధ్యలోనే గ్రామ సభ నుంచి వెళ్లిపోయాడు.

దీంతో ఆగ్రహించిన పాలక వర్గం, గ్రామస్తులు గ్రామ పంచాయితీ ఆఫీస్​కు తాళం వేసి అక్కడే ధర్నా చేశారు. నిధులు సొంత ఖర్చులకు వాడుకున్న సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయితీ సెక్రటరీ అశోక్ కు వినతి పత్రం అందజేశారు.