మహబూబాబాద్ జిల్లాలో ఘనంగా గంగమ్మ తల్లి జాతర

తొర్రూరు, వెలుగు : మహబూబాబాద్ జిల్లా గుర్తూరులో గంగపుత్రులు సోమవారం గంగమ్మ తల్లి జాతరను ఘనంగా నిర్వహించారు. బిందెల్లో నీటిని తీసుకుని, మంగళహారతులతో డప్పుచప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ

ఆలయానికి చేరుకొని గంగమ్మ తల్లి విగ్రహాలను శుద్ధి చేసి, మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో మత్స్య సొసైటీ, గంగ పుత్ర సంఘం ముఖ్య నేతలు, మహిళలు, భక్తులు   తదితరులు పాల్గొన్నారు.