చెరువుల పండుగ’ పైసలేవి..

జగిత్యాల, వెలుగు:  ఇటీవల జరిగిన చెరువుల పండుగ నిర్వహణకు ఖర్చయిన డబ్బులు తనకివ్వాలని  చేపల లోడు వ్యాన్​ను జగిత్యాల రూరల్ మండలం పొలాస సర్పంచ్ భర్త నందయ్య అడ్డుకున్నాడని గంగపుత్రులు ఆందోళనకు దిగారు.  దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కు  రూ.లక్ష ఖర్చుకాగా,  సర్కార్ రూ. 40 వేలు మంజూరు చేస్తుందని మిగిలిన రూ. 60 వేలు కాంట్రాక్టర్ ఇవ్వాలని సర్పంచ్ భారతి భర్త నందయ్య చేపలు తరలించే వ్యాన్ ను అడ్డుకున్నాడని గంగపుత్రులు ఆరోపించారు. 

ALSOREAD:హైకమాండ్ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతల కీలక భేటీ

అలాగే ఐస్ ట్రేలలో ఉన్న చేపల తో సహా చెరువు కట్టపై దించాడని తెలిపారు.  దీంతో సుమారు రూ.3 లక్షల వరకు నష్టపోయామని సర్పంచ్ భర్త తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  సదరు కాంట్రాక్టర్ ను తనకు రావాల్సిన డబ్బులు అడగడానికి వెళ్లడంతో  కాంట్రాక్టర్  చెరువు కట్టపై చేపలు కుమ్మరించాడని సర్పంచ్ భర్త నందయ్య మీడియాకు తెలిపాడు.