
ఇండియాలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ హర్దీప్ సింగ్ అలియాస్ హ్యాపీ పాసియాను అమెరికాలో అరెస్ట్ చేశారు. టెర్రిరిస్టులతో లింకులు ఉన్నట్టు అనుమానిస్తూ హర్దీప్ సింగ్ ను అమెరికా ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (FBI)టీం అరెస్ట్ చేసింది. హర్దీప్ సింగ్ పంజాబ్‌లో అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినిట్లు ఆరోపణలు ఉన్నాయి. అటు పంజాబ్ పోలీసులు ఇటు కేంద్ర నిఘా విభాగాలకు పెద్ద తలనొప్పిగా మారిన హ్యాపీ పాసియాగా పిలువబడే హర్దీప్ సింగ్ పై రూ. 5లక్షల రివార్డు ఉంది. అతని కోసం వెతుకుతున్న భారత భద్రతా సంస్థలకు ఇది ఒక ముఖ్యమైన పురోగతి.పాసియాను అరెస్ట్ చేసినట్లు ధృవీకరిస్తూ FBI ,US ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ (ERO) కస్టడీలో ఉన్న అతని ఫొటోలను రిలీజ్ చేశారు.
హర్దీప్ సింగ్ అరెస్టును ధృవీకరిస్తూ FBI అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారత్ లోని పంజాబ్‌లో ఉగ్రవాద దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉగ్రవాది హర్‌ప్రీత్ సింగ్‌ను FBI ,ERO సాక్రమెంటోలో అరెస్టు చేశాయి. రెండు అంతర్జాతీయ ఉగ్రవాద గ్రూపులతో సంబంధం కలిగి ఉన్న అతను చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించి పట్టుబడకుండా ఉండటానికి బర్నర్ ఫోన్‌లను ఉపయోగించాడని FBI సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది.
పాసియాకు పాకిస్తాన్ ఐఎస్ఐ ,బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బికెఐ),హర్విందర్ సింగ్ రిండా నెట్‌వర్క్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. పంజాబ్‌లో అనేక దాడులకు ప్లాన్ అమలు చేయడంలో పాసియా కీలక పాత్ర పోషించాడని నిఘా సంస్థలు ఆరోపించాయి. జనవరి 2025లో అమృత్సర్‌లోని గుమ్తాలా పోలీస్ పోస్ట్ సమీపంలో జరిగిన పేలుడు కేసులో కీలక నిందితుడిగా ఉన్నారు. ఆ పేలుడులో ఒక సీనియర్ అధికారి వెహికల్స్ పేలిపోయింది.ఆ దాడికి బాధ్యత వహిస్తూ పాసియా మరిన్ని బెదిరింపులు, తన కుటుంబంపై పోలీసు చర్యలకు ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. అమెరికాలో అక్రమంగా చొరబడి ఉంటున్నారని సమాచారంతో FBI అరెస్ట్ చేసింది.