లేడీ డాన్ తో గ్యాంగ్‌స్టర్ పెళ్లి.. 250 మంది పోలీసుల బందోబస్తు

ఢిల్లీలో ఓ గ్యాంగ్ స్టార్ పెళ్లి చర్చనీయాంశంగా మారింది. దానికి కారణం లేకపోలేదు.. ఆ గ్యాంగ్ స్టార్ పెళ్లికి ఏకంగా 250 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.  ప్రస్తుతం ఈ వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ సందీప్ అలియాస్ కాలా జాతేడి, లేడీ డాన్ అనురాధ చౌదరి అలియాస్ 'మేడమ్ మింజ్'లు పెళ్లి చేసుకోబోతున్నారు. మార్చి 12వ తేదీ  మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో ద్వారకా సెక్టార్-3లోని సంతోష్ బాంకెట్‌లో వీరి పెళ్లి జరగనుంది. 

ఈక్రమంలో పెళ్లి వేడుక దగ్గర ఎలాంటి గ్యాంగ్ వార్‌లు జరగకుండా, కాలా జాతేడి కస్టడీ నుండి తప్పించుకోకుండా భారీగా 250 మందికి పైగా పోలీసులను మోహరించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు.  ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, స్పెషల్ స్టాఫ్, క్రైమ్ బ్రాంచ్‌ల బృందాలతో టైట్ సెక్యూరిటీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ వివాహానికి హాజరయ్యే  అతిథులకు బార్‌కోడ్ బ్యాండ్‌లు ఇవ్వడం జరుగుతుందని..  విందు దగ్గర పార్క్ చేయడానికి ఎంట్రీ పాస్ లేకుండా ఏ వాహనాన్ని అనుమతించబోమని పోలీసు అధికారి తెలిపారు. వేదిక ప్రవేశం వద్ద రెండు డోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్‌లను ఏర్పాటు చేశామని, వివాహానికి హాజరైన ప్రతి ఒక్కరూ దాని గుండా వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. పెళ్లి వేదిక పరసరాల్లో అర డజనుకు పైగా CCTV కెమెరాలు, డ్రోన్‌లు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ALSO READ :- IPL 2024: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. గాయంతో సూర్య కుమార్ యాదవ్ ఔట్

ఈ వివాహానికి వచ్చే150 మంది అతిథుల జాబితాను సందీప్ కుటుంబం తమకు ఇచ్చిందని.. ఈ కార్యక్రమంలో వెయిటర్, కార్మికులకు గుర్తించేందుకు ఐడి కార్డులు అందజేస్తామని చెప్పారు. గ్యాంగ్ వార్ లు,  ఎస్కేప్ ఎటువంటి అవకాశం ఇవ్వకూడదని.. తీహార్ నుండి ద్వారకలోని వివాహ వేదిక వరకు పెద్ద ఎత్తున పోలీసు సిబ్బందిని మోహరించామని తెలిపారు.