ఇద్దరు గ్యాంగ్ స్టార్స్ లవ్ లో పడ్డారు. వారు మార్చి 12న పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే పెళ్లి కొడుకు జైలులో ఉండి బెయిల్ పై వచ్చి విహహాం చేసుకుంటున్నాడు. అసలు ఈ గ్యాంగ్ స్టార్స్ లవ్ స్టోరీ ఏంటి? వీరు ఎక్కడ కలిశారు? అనే విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇద్దరు గ్యాంగ్ స్టార్స్ విహాహ వేడుక కోర్టు అనుమతితో పోలీసుల బందోబస్త్ మధ్య జరగనుంది. కాలా జాతేరి ఢిల్లీ కోర్టు పెళ్లి కోసం రెండు రోజులు మార్చి 12, 13 పేరోల్ బెయిల్ మంజూరు చేసింది.
ఎవరీ కాలా జాతేరి?
హర్యానా రాష్ట్రం సోనిపట్ లోని జాతేరి గ్రామానికి చెందిన సందీప్ అలియాస్ కాలా జాతేరి పెద్ద గ్యాంగ్ స్టార్. పంజాబ్, హర్యాన, రాజస్థాన్ లో ఇతనిపై 25 కేసులకు పైగా ఉన్నాయి. మహారాష్ట్రలో ఓ క్రిమినల్ గ్యాంగ్ ను కూడా నడుపుతున్నట్లు కాలాపై ఆరోపణలు ఉన్నాయి. రాజస్థాన్ లో సాగర్ ధన్ ఖడ్ అనే ఓ రెజ్లర్ హత్యతో సందీప్ క్రిమినల్ గా మారి పెద్ద గ్యాంగ్ స్టార్ వరకు ఎదిగాడు.
లేడీ డాన్ తో గ్యాంగ్ స్టార్ లవ్ స్టోరీ
2021లో ఢిల్లీ తీహార్ జైలులో ఉన్నప్పుడు కాలాకు ఓ లేడీ గ్యాంగ్ స్టార్ పరిచయం అయింది. అది కాస్త ప్రేమగా మారింది. రాజస్థాన్ లోని సికార్ జిల్లాలోని అల్ఫాసర్ గ్రామానికి చెందిన అనురాధ చౌదరిని రివాల్వర్ రాణి, మేడం మింజ్ అని కూడా పిలుస్తారు. మేడం మింజ్ కంప్యూటర్స్ అప్లికేషన్స్ లో డిగ్రీ చేసింది. స్టాక్ మార్కెట్లో తన పాట్నర్ ని మోసం చేసి, కోటి రూపాయల వరకూ అప్పులు చేసి క్రైమ్స్ చేసి లేడీ డాన్ గా సెట్టిలైంది. ఈమె పలు నేరాల్లో శిక్ష కూడా అనుభవించింది.
ఈమెపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. కాలా, రివాల్వర్ రాణి 2021 కొవిడ్ టైంలో ప్రేమలో పడ్డారు. తర్వాత అనురాధకు బెయిల్ వచ్చింది. కాలా జాతేరి మాత్రం ఇప్పటి వరకూ జైలులోనే ఉన్నాడు. శిక్ష అనుభవిస్తున్న కాలాను అప్పుడప్పుడు అనురాధ జైల్లో కలుస్తూనే ఉంటుంది. తీహార్ జైలులో ఉన్న గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్ తో కూడా కాలా జాతేరికి లింక్స్ ఉన్నాయి. ఢిల్లీలో బిష్ణోయ్ గ్యాంగ్ ను కాలా లీడ్ చేసేవాడు. ప్రస్తుతం సందీప్ ఢిల్లీ తీహార్ జైల్ ఉన్నాడు. వృద్ధాప్యంలో ఉన్న ఆయన తల్లిదండ్రులు స్వగ్రామంలో ఉంటారు. అనురాధ వారిని చూసుకుంటుంది.