ముంబై: ‘మగాళ్లకు ఎందుకింత పొగరు’ అంటోంది అలియా భట్. రీసెంట్ గా విడుదలైన గంగూబాయి కతియావాడీ ట్రైటర్ లోని డైలాగ్ ఇది. ప్రముఖ హిందీ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ చిత్రంలో గంగూబాయిగా ఆర్ఆర్ఆర్ హీరోయిన్ అలియా నటిస్తోంది. బొంబాయి వీధుల్లో గంగూబాయి అధికారంలోకి రావడం గురించి చెబుతూ ట్రైలర్ లో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. కామాటిపుర అనే ఒక రెడ్ లైట్ ఏరియాలో ఉండే ఒక సాధారణ అమ్మాయి గంగూబాయిగా.. ఒక రాజకీయ నాయకురాలిగా ఎదగడం వరకు చేసిన పోరాటాన్ని, ఆమె ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ ట్రైలర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన అలియా భట్.. ఫిబ్రవరి 25న థియేటర్లలోకి వస్తున్నామని తెలియజేసింది.
ఈ మూవీలో అలియా భట్‌తో పాటు విజయ్ రాజ్, జిమ్ సర్భ్ కీలక పాత్రల్లో నటించారు. అజయ్ దేవగన్ కూడా మూవీలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. ట్రైలర్‌లో అజయ్ కొన్ని సెకన్ల పాటు మాత్రమే కనిపించినప్పటికీ ఆయన పాత్ర కీలకమని అర్థమవుతోంది. ఎస్. హుస్సేన్ జైదీ ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ పుస్తకం ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ ‘గంగూబాయి కతియావాడి’ని తెరకెక్కించారు. నిజజీవితంలో గంగూబాయి సెక్స్ వర్కర్లతోపాటు అనాథల బాగు కోసం తీవ్రంగా కృషి చేశారని చెబుతుంటారు.
మరిన్ని వార్తల కోసం: